మొలకెత్తిన వడ్లను కొనండి

రైతుకు మద్దతుగా హరీష్‌రావు ట్వీట్‌
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం

హైదరాబాద్‌, మహానాడు : ఐదు రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో ఆవేదనకు గురైన సంతోష్‌ అనే రైతుకు మద్దతుగా ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్‌ జిల్లాకు చెందిన సంతోష్‌ అనే రైతు కష్టాలే నిదర్శనమన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ సిద్దిపే ట జిల్లా గాగులాపూర్‌ అన్నపూర్ణ రైస్‌ మిల్లుకు వారి గ్రామం నుంచి ఐదు లారీల వడ్లను పంపారు. ఐదురోజులైనా ప్రభుత్వం కొనడం లేదు.

కొనడానికి నిరాకరిస్తున్నారు…

అధికారుల జాప్యం తో ధాన్యం మొలకెత్తింది. ఇప్పుడు కొనడం సాధ్యం కాదని తిరిగి తీసుకెళ్లండి అని నిరాకరిస్తున్నారు. సంతోష్‌ కాళ్లావేళ్లా పడితే లారీకి 50 బస్తాలు తరుగు తీస్తేనే కొంటామని, లేకపోతే కొనమని నిర్లక్ష్యంగా చెబుతున్నారు. ఐదురోజులు గా డ్రైవర్లకు భోజన వసతి సదుపాయాల ఖర్చును సంతోష్‌తో పాటు గ్రామస్తు లు భరిస్తున్నారు. ప్రభుత్వం మొలకెత్తిన వడ్లను కొంటామని చెబుతున్నా అధికా రుల నుంచి ఎలాంటి స్పందనా లేదని హరీష్‌రావుకు ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన మెదక్‌ జిల్లా కలెక్టర్‌, సిద్దిపేట కలెక్టర్‌, సంబంధిత శాఖ ల అధికారులు వెంటనే స్పందించి సంతోష్‌ సమస్యను పరిష్కరించాలని ట్విట్టర్‌ వేదికగా కోరారు.