– శంకరమఠంలో ఎమ్మెల్యే చదలవాడ ప్రత్యేక పూజలు
నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ఆయన భార్య సుధా రాజేశ్వరి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శంకరమఠాన్ని సందర్శించారు. దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవానుగ్రహంతో, శృంగేరి శంకరమఠం పీఠాధిపతి ఆశీర్వచనంతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి సాగునీరు అందుబాటులోకి వచ్చిందన్నారు. రెండు పంటలు వేసుకునేందుకు పుష్కలంగా నీరు ఉందన్నారు. మంచినీటికి గ్రామాలు, పట్టణాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్రభుత్వ పాలనకు ప్రకృతి సహకారం అందిస్తుందన్నారు.