Mahanaadu-Logo-PNG-Large

డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు టిడ్కో గృహాలకు మౌళిక‌వ‌స‌తులు పూర్తి

కేంద్రం అనుమ‌తించిన వేలాది ఇళ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం నిలిపివేసింది
ప్ర‌తి మ‌హిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం
– మంత్రి పొంగూరు నారాయ‌ణ‌

అమ‌రావ‌తి: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల‌తో పాటు మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న వ‌చ్చే డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేసేలా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు మున్సిప‌ల్,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.
టిడ్కో గృహాల‌పై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు,వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు,తెనాలి శ్రావ‌ణ్ కుమార్,కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2014-2019 మ‌ధ్యకాలంలో నిర్మించిన టిడ్కో గృహాల ప్రాంతాల వారీ వివ‌రాలు,విశాఖ జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లు,మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై స‌భ్యులు ప్ర‌శ్న‌లు అడిగారు. ఆయా ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధాన‌మిచ్చారు.

రాష్ట్రంలో 2014 నుంచి 2019 వ‌ర‌కూ నిరుపేద‌ల కోసం టిడ్కో గృహాల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ట్లు మంత్రి తెలిపారు…ప్ర‌తి మ‌హిళ త‌న కుటుంబంతో ఆనందంగా ఉండే ఇళ్లు క‌ట్టాల‌ని ఎంత ఖ‌ర్చ‌యినా ప‌ర్వాలేద‌ని సీఎం చెప్పారన్నారు.అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం దేశ‌విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ పేద‌ల‌కు ఇళ్లు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి ఇక్క‌డ ఇళ్లు కట్టినట్లు మంత్రి తెలిపారు.

దీంట్లో భాగంగా టిడ్కో ద్వారా మొత్తం 7 లక్షల 1481 ఇళ్లను నించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నట్లు మంత్రి సభకు వెల్లడించారు..వీటిలో 5 లక్షల ఇళ్లకు నాటి టీడీపీ ప్రభుత్వంలో పాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు.మొత్తం 5 లక్షల ఇళ్లకు గాను 3 లక్షల 13 వేల 832 ఇళ్లకు టెండర్లు పిలవగా 77 వేల 371 ఇళ్లు పూర్తయినట్లు మంత్రి తెలిపారు.

మరొక 89 వేల 671 ఇళ్లు 75 శాతం పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు..మ‌రొక 49 వేల 329 ఇళ్లు 50 శాతం పూర్తి చేసామ‌న్నారు.2,16,370 ఇళ్లు 2019 ఏడాదిలోపే చాలా వ‌ర‌కూ పూర్తి చేసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు.అయితే వైసీపీ ప్రభుత్వం 25 శాతం కూడా పూర్తి కాలేదని కారణంతో 52 వేల 192 ఇళ్లను జాబితా నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు.మొత్తం 104 మున్సిపాల్టీల్లో 2,61,640 ఇళ్లు ప్రారంభించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

ఇక విశాఖ‌ప‌ట్నం ప‌ద్మ‌నాభ న‌గ‌ర్ లో 864 ఇళ్ల‌కు టెండ‌ర్లు పిలిచి పూర్తిచేసామ‌న్నారు. అచ్చినాయుడు లోవ లో 4608 ఇళ్లు కేటాయించ‌గా 3984 ఇళ్ల‌కు టెండ‌ర్లు పిలిచి నిర్మాణాలు పూర్తి చేసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. ముల‌గాడ లో 504 ఇళ్లు కేటాయించ‌గా 336 ఇళ్లు నిర్మాణాలు పూర్త‌యిన‌ట్లు చెప్పారు.

కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్త‌యిన‌ప్ప‌టికీ మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న పూర్తి కాక‌పోవ‌డంతో ల‌బ్దిదారుల‌కు అందించ‌లేద‌న్నారు.మొత్తంగా 3ల‌క్ష‌ల‌13వేల‌832 ఇళ్ల‌ను డిసెంబ‌ర్ నెలాఖ‌రులోగా పూర్తి చేయ‌డానికి అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు మంత్రి పొంగూరు నారాయ‌ణ శాస‌న‌స‌భ‌లో వివ‌రించారు.