వారం రోజుల పాటు ‘ప్రజా వేదిక’ రద్దు

మంగళగిరి, మహానాడు: ఇక్కడి ఎన్టీఆర్ భవన్ లో జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు రద్దు అయింది. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.. ఈ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 15వ తేదీ వరకు రద్దు చేశాం.. ఆ రోజుల్లో ఎటువంటి గ్రీవెన్స్ ఉండదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం కార్యదర్శి, శాసనమండలి సభ్యుడు పర్చూరి అశోక్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.