గుంటూరు నగరం లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్ లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.