ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ కు క్యాట్ బ్రేక్

తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ మధుసూదన్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన తనను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.

దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ లోని క్యాట్ ధర్మాసనం.. మధుసూధన్ రెడ్డి సస్పెన్షన్ ను నిలిపేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆయన్ను సస్పెండ్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది.

మధుసూదన్ రెడ్డిపై అక్రమాలకు పాల్పడిన ఆధారాలుంటే, ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారని భావిస్తే ఆయన్ను ఫైబర్ నెట్ ఎండీ బాధ్యతల నుంచి తప్పించి, జీఏడీకి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన రోజే సస్పెండ్ చేయాల్సిందని క్యాట్ తెలిపింది. ఆయన్ను సస్పెండ్ చేసిన జీవో నంబర్ 75 అమలు నిలిపేసింది.