సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

హైదరాబాద్‌ :  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహే శ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించి మొత్తం 17 స్థిర, చరాస్తులను గుర్తించారు.. ఘట్‌కేసర్‌లో 5 ప్రాపర్టీలను కనుగొన్నారు. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.3 కోట్ల పైనే ఉంటుందని అంచనా.