నారీ శక్తి పేరుతో విజయోత్సవం
కూటమి గెలుపును స్వాగతిస్తూ కార్యక్రమం
అమరావతి: దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్రా ప్రజల తీర్పు స్వాగతిస్తూ అట్లాంటా తెలుగుదేశం ఆడపడుచులు, వీర మహిళలు సంబరాలు అంబరాన్ని అంటేలా చేసుకున్నారు. ఏపీలో ఏ విషయాన్ని అయినా గమినిస్తూ ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేయటానికి ముందుండే ప్రవాసాం ధ్రులలో ముఖ్యులు అట్లాంటా తెలుగు ప్రజలు. ఈ ఎన్నికలలో కూడా ముఖ్య భూమిక పోషించారు. కూటమి విజయాన్ని ఆస్వాదించటానికి ‘‘నారీ శక్తి’’ కది లింది. అట్లాంటాలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి ప్రోత్సహించే సంక్రాం తి రెస్టారెంట్ యాజమాన్యం, కాట్రగడ్డ కవిత, నిమ్మగడ్డ శ్రీనివాస్ ఈ ఈవెంట్ కు సకల సదుపాయాలు అందించారు. స్పాంటేనియస్ డెసిషన్‌తో మహిళల ఆనందాన్ని అందరితో పంచుకోవటానికి భాగస్వాములైన కాకాని మాధవి, కాట్రగడ్డ కవిత, ఆలూరి ఉష, వీరిశెట్టి వేద, ఆలోకం సుజాత తదితరులను అభినందించారు. ముందుగా ఆలోకం సుజాత ఎన్టీఆర్ ప్రతిమ ముందు విజయ దీపారాధన చేయటానికి పెద్దలను ఆహ్వానించారు.
ఎట్టకేలకు రాష్ట్రం మళ్లీ భావితరాల అభ్యున్నతికి బాటలు వేస్తూ, ప్రజాహితమైన సంక్షేమాన్ని అందిస్తూ ప్రతిఒక్కరిని కలుపుకుపోయే నైపుణ్యం, పరిపాలనా దక్షత ఉన్న నాయకుడి చేతుల్లోకి రావటాన్ని హర్షించారు. అట్లాంటా వాసి వెనిగండ్ల రాము గుడివాడలో గెలుపును ప్రస్తావిస్తూ వారితో తమకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వీడియో కాల్‌లోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలలో ప్రవాసాంధ్రుల పాత్రను కొనియాడారు. చివరిగా కూటమి కేకులు కోసి ఆనంద నృత్యాలు చేశారు. ఇటువంటి నారీ శక్తి ని ప్రదర్శించే కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.