-ఘన విజయం సాధించడంతో కోటప్పకొండకు పాదయాత్ర
-కొత్తపాలెం నుండి టీడీపీ శ్రేణుల యాత్రను ప్రారంభించిన డా౹౹చదలవాడ
రెండు దశాబ్దాలుగా కలగా మిగిలిన విజయాన్ని భారీ మెజారిటీతో సాధించిన నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గం కొత్తపాలెం గ్రామస్తులు కోటప్పకొండలో మోక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు.తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంతోషాన్ని,అభిమానాన్ని చూసి భావోద్వేగంతో పాదయాత్రను ప్రారంభించారు.ఎన్నో కుట్రలు మరెన్నో కుతంత్రాలు కుయుక్తులు పన్నినా ప్రజలు తెలుగుదేశం పార్టీకి నరసరావుపేటలో భారీ మెజారిటీ అందించడం పై హర్షం వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి పై ప్రజలు ఎంతగా విరక్తి చెందారో,తిరుగుబాటుకు ఏ స్థాయిలో తెగించారో మొన్నటి ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు. రెండు దశాబ్దాలుగా నరసరావుపేట ను శాసిస్తున్న గోపిరెడ్డి లాంటి అరాచక శక్తులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు ఏకమై ఇంటికి పంపించారు.ఇటువంటి ఘనవిజయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ అంకితం ఇస్తున్నానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.పాదయాత్రగా బయలుదేరిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు తెలిపారు.ఇంతటి చిత్తశుద్ధి పార్టీ అంకితభావం కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతమన్నారు.పాదయాత్రను భావోద్వేగంతో కూడిన సంతోషం మధ్య ఎమ్మెల్యే డా౹౹చదలవాడ ప్రారంభింఛారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.