ధర్మవరం, జమ్మలమడుగులో కేంద్ర బలగాలు

` హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయండి
` డీజీపీ, ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ వినతి

అమరావతి, మహానాడు : హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కు మార్‌ మీనా, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశా రు. ధర్మవరం, జమ్మలమడుగు పోలింగ్‌ కేంద్రాలలో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని కోరారు. స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి సోమవారం ఉదయం 10 గంటల లోపు తీసుకున్న చర్యలపై రిపోర్ట్‌ సమర్పించాలని డీజీపీని ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఎస్‌ఆర్‌ స్థాయి ప్రత్యేక పోలీసు అధికారితో పాటు కేంద్ర భద్రతా బలగాలను నియమిస్తున్నట్లు బీజేపీ ప్రతినిధులకు డీజీపీ వివరించారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయని హామీ ఇచ్చారు. సీఈవో, డీజీపీని కలిసిన వారిలో బీజేపీ సీనియర్‌ నాయకులు కిలారు దిలీప్‌, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ, అడ్వొకేట్‌ బాచన హనుమంత రావు, సీనియర్‌ నాయకులు జయప్రకాష్‌ ఉన్నారు.