నరసరావుపేట: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నారా భువనేశ్వరి, నారా లోకేష్‌లను కుటుంబంతో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దంపతులు కలిసి అభినందనలు తెలిపారు. నరసరావుపేట వంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే అవకాశం చంద్రబాబు ప్రోత్సాహంతో మాత్రమే సాధ్యమైందని చదలవాడ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని శాసనసభకు పంపించిన ఘనత చంద్రబాబు, తెలుగు దేశం పార్టీది మాత్రమేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తానని తెలిపారు.