సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

– ఎమ్మెల్యే గళ్ళ మాధవి

గుంటూరు, మహానాడు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. తొలుత చంద్రమౌళి నగర్ లోని బి.యస్.యన్.యల్ కార్యాలయం వద్ద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ జయంతిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతాంగ పోరాట యోధురాలు, ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే కొనియాడారు. చాకలి ఐలమ్మ అందించిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. అణిచివేత కు గురయిన బడుగు, బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన కు, పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారన్నారు.