– విలేకరిపై దాడిని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి :- పల్నాడు జిల్లా, అమరావతిలో విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుండి వైసీపీ అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
పరమేశ్వరరావుపై దాడి చేసిన గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు ఎన్జీటీకి నివేదికలు ఇచ్చాయని, ఇంత జరగుతున్నా కలెక్టర్లు కూడా పట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. అధికార వైసీపీ ఇసుక మాఫియాపై భవిష్యత్తులో చర్యలు తప్పవని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.