ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది

– ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరు, మహానాడు: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వం తీసుకుంటోందని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. బుధవారం గుంటూరు 42 వ డివిజన్ ఆంజనేయ నగర్ 1వ లైన్ వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’, ‘స్వర్ణాంధ్ర@2047’ కార్యక్రమానికి గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి, స్థానిక సమస్యల గురించి ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఓ కొత్త కార్యక్రమం చేపట్టిందని, స్వర్ణాంధ్ర@2047 పేరుతో ఓ సర్వే చేపట్టిందని తెలిపారు.

మీ విజన్ – మా మిషన్.. కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దామంటూ ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తోందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 43 వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో కూడిన 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారని, విజన్ ఉన్న నాయకుడు అనేందుకు విజన్ – 2020యే సాక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, మద్దిరాల మ్యాని, లంకా ఉదయ్ కుమార్, పాకలపాటి శ్రీకాంత్, మానుకొండ శివప్రసాద్, ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు.