శేషగిరిరావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

ఫోన్‌లో బాధితుడికి పరామర్శ
ధైర్యంగా పోరాడారని అభినందన
పార్టీ అండగా ఉంటుందని భరోసా

అమరావతి, మహానాడు : మాచర్ల పాల్వాయి గేటు పోలింగ్‌ స్టేషన్‌ ఘటనకు సంబంధించి పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడ్డ బాధితుడు నంబూరి శేషగిరిరావును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీరు చూపిన ధైర్యం, పోరాటం ప్రశంసనీయమని అభినందించారు. పోలింగ్‌ రోజు పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిని టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావు ధైర్యంగా ప్రశ్నించాడు. ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకు నే ప్రయత్నం చేసిన ఆయనపై అదేరోజు ఇంటి దగ్గరే మారణాయుధాలతో పిన్నె ల్లి అనుచరులు దాడి చేశారు. తాజాగా ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు.