చంద్రబాబు రాజకీయ అజ్ఞాని

– ఎక్స్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శ

విజయవాడ: హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిజమైన హిందువు దేవుడిని, హిందూ మతాన్ని నమ్మకుంటాడని, రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడుని, మతాన్ని వాడుకుంటారని విజయసాయిరెడ్డి విమర్శించారు.