4న దర్శిలో చంద్రబాబు ప్రజాగళం సభ

దర్శి, మహానాడు : ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 4న ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ జరుగుతున్న ఈ సభకు వేలాదిగా తెలుగు దేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దర్శి ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, కడియాల లలిత్‌సాగర్‌, నియోజకవర్గ టీడీపీ యువనాయకుడు పమిడి రమేష్‌, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గోరంట్ల రవికుమార్‌, దర్శి నగర్‌ పాలక చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

బహిరంగ సభలో గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌, గొట్టిపాటి భరత్‌, ఒంగోలు పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, దర్శి నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్‌ గరికపాటి వెంకట్‌, బోటుకు రమేష్‌, వరికూటి నాగరాజు, బీజేపీ నాయకులు మండపాకుల శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి పార్టీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారని వివరించారు.