Mahanaadu-Logo-PNG-Large

రేపు ప్రమాణం తర్వాత తిరుమలకు చంద్రబాబు

-అక్కడే రాత్రి బస.. గురువారం శ్రీవారి దర్శనం
-వారంరోజులు సెలవులో ఈవో ధర్మారెడ్డి
-ప్రోటోకాల్‌ ఏర్పాట్లపై అనుమానాలు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబంతో తిరుమల వెళ్లనున్నారు. ఇదేరోజు రాత్రికి ఆయన తిరుమలలో బస చేసి 13వ తేదీన గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారం రోజులు సెలవు పెట్టాడు. ఆయనకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సెలవు మంజూరు చేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో వచ్చినప్పుడు స్వాగతం పలికిన సందర్భాలు లేవు. ఇప్పుడు సీఎం హోదాలో ప్రోటోకాల్‌ ప్రకా రం దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయాల్సి ఉండగా సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. తిరుమలలో ఉన్న ఉద్యోగులు, స్థానికులు, వ్యాపారస్తులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 20 ఏళ్లుగా తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న సులభ, త్రిలోక్‌ సంస్థలను తొలగించి వేలాదిమంది కార్మికులను రోడ్డుపై పడేశాడు. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు టీటీడీ పరిపాలన భవనం వద్ద ధర్నాలు, నిరసనలు పెద్ద ఎత్తున చేశారు. జగన్మోహన్‌ రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మాటలే వేదంగా టీటీడీ పరిపాలనను ఈవో నిర్వహించారు. శ్రీవారి నిధులను ప్రైవేట్‌ బ్యాంకుల్లో నిల్వ చేశారని, బంగారం, విదేశీ కరెన్సీ, శ్రీవాణి నిధులను దుర్విని యోగం చేశారని గతంలో ప్రతిపక్ష నాయకులు ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. నూతన ప్రభుత్వం నేపథ్యంలో ఆయనను కొనసాగిస్తారా లేదా వేరొకరిని నియమిస్తారా అన్నది వేచిచూడాలి.