రేపు విదేశాల నుంచి చంద్రబాబు రాక

అమరావతి, మహానాడు: విదేశీ పర్యటకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. పోలింగ్‌ తరువాత ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8.30కు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ నివాసానికి చేరుకుంటారు.