-కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ప్రత్యేక కమిటీ చైర్మన్‌గా నారా లోకేష్
అమరావతి, మహానాడు: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం కష్టపడుతూ అండగా ఉంటున్న కార్యకర్తల కోసం ఆయన ప్రత్యేకంగా కమిటీ వేశారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కమిటీ ఉద్దేశం. కమిటీ చైర్మన్‌గా నారా లోకేష్, సభ్యులుగా జూలకంటి బ్రహారెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, యరపతినేని శ్రీనివాసరావు, జె.సి.ప్రభాకర్ రెడ్డి, నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, ఎం.ఎస్.రాజు నియమించారు.