– పోలవరం పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం
– నిడిమామిడి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి సవితా,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు
నిడిమామిడి: వ్యవసాయాన్ని లాభసాటిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అశయమని రాష్ట్ర చేనేత ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీ లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిడి మామిడి గ్రామంలో వరి సాగుచేసిన వెంకట రాముడు పొలాన్ని మంత్రి సవితా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు సందర్శించారు.
అనంతరం నిడిమామిడి జడ్పీ హైస్కూల్ ఆవరణలో వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలోపొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రివర్యులు రఘునాథరెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, గ్రామ సర్పంచ్ లత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్ పాలనలో వ్యవసాయాన్ని తుంగలో తొక్కారనీ ఆమె పేర్కొన్నారు. జగన్ హయంలో రైతులకు ఎలాంటి రాయితీ పరికరాలు అందించలేదని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు డ్రిప్పులను రాయితీతో అందిస్తోందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయుచున్నాడని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మొట్టమొదటి సంతకం డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారని పేర్కొన్నారు, వివిధ సామాజిక భద్రత పెన్షన్లు ఎన్టీఆర్ పెన్షన్లు ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందని తెలిపారు, అక్టోబర్ నెలలో అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని, దీపావళి పండుగ రోజున గ్యాస్ సిలిండర్లు మహిళలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందజేయుచున్నామని తెలిపారుఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో వ్యవసాయాన్ని రైతులకు ఒక పండుగ మార్చాలన్న ఉద్దేశ్యంతో పొలం బడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వ్యవసాయ అధికారులు వారంలో మూడు రోజులు రైతుల పొలాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు.
హలో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని ఉద్దేశ్యం చంద్రబాబుది అన్నారు. గత ఎన్నికల ముందు టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం వచ్చి పంటలపై రైతుల ఆసక్తి చూపాలని రైతులకు పిలుపునిచ్చారు.
పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, రైతులు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అశయమని అన్నారు. టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లో వ్యవసాయాన్ని రైతులకు ఒక పండుగ మార్చాలన్న ఉద్దేశ్యంతో పొలం బడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ప్రతి రైతు సాగుచేసిన పంటను తప్పకుండా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించారు. ఈక్రాప్ చేయించుకున్న రైతులకు పంట నష్టపోతే ప్రభుత్వం నుంచి పంటల బీమా లేదా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈ ఖరీఫ్ లో సాగు చేయని రైతులు ఉంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ విత్తనాలను ఉలవ ,పెసలు, అలసంద వంటి విత్తనాలను మంజూరు చేస్తోందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన టెక్నాలజీని అలవర్చుకోవాలని సూచించారు. రైతులు పంట మార్పిడి చేసి పంట దిగుబడి పెంచుకొని ఆదాయాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ రైతాంగం ప్రతి ఏటా అతివృష్టి అనావృష్టి తో తీవ్రంగా నష్టపోతున్నారని అలాంటి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి పొలంబడి వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
రాయలసీమ రైతాంగానికి హంద్రీనీవా ఒక వరం అన్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను వెనుకబడిన అనంత, సత్యసాయి ఉమ్మడి జిల్లాకు తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం హంద్రీనీవా కాలువను వెడల్పు చేసే కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పోలవరం పూర్తి అయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందనీ పేర్కొన్నారు.
అంతకుముందు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిడిమామిడి గ్రామానికి విచ్చేసిన మంత్రి సవితా, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎద్దుల బండి పై ఊరేగింపుగా వెళ్ళారు.