Mahanaadu-Logo-PNG-Large

వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు

ప్రతి గ్రామంలో ఐదుగురికే చోటు
జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
డిగ్రీ ప్రామాణిక అర్హతతో నియామకం
కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్న ప్రభుత్వం
సర్పంచుల పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది
ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ప్రాతినిధ్యం

అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు తీసుకొ చ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఐదుగురికి మాత్ర మే చోటు కల్పించనున్నారు. జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచను న్నారు. కొత్తగా వాలంటీర్ల నియామకం కోసం కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నా రు. డిగ్రీ ఉత్తీర్ణతతో వీరిని నియమించనున్నారు. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. వాలంటీర్లు, సచివాల య సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయనున్నారు. ప్రతినెలా పెన్షన్‌దారు లకు ఇచ్చే నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది.