-ఈ ఎన్నికల్లో రేవంత్ గోల్‌మాల్ ఖాయం
-కాంగ్రెస్ చార్జిషీట్‌పై ఈటెల రాజేందర్ స్పందన
వరంగల్, మహానాడు: బీజేపీ పదేళ్ల పాలనపై రేవంత్ విడుదల చేసిన చార్జిషీట్‌పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణ ప్రజలు మే 13న మీకు చార్జిషీటు పెట్టనున్నారు. చార్జిషీట్ విడు దల చేయాల్సింది మీరు కాదు..తెలంగాణ ప్రజలన్నారు. బీజేపీపై ఎందుకు చార్జిషీట్ వేస్తున్నా రో చెప్పాలని ప్రశ్నించారు. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొల్పినం దుకా? రామమందిరం నిర్మించినందుకా? 4 కోట్ల ఇళ్లు కట్టినందుకా? అని ప్రశ్నించారు. మీరు చార్జిషీట్ పెట్టాల్సింది కేసీఆర్ మీదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై బోఫోర్స్ స్కాం లేనందుకా? కోల్ స్కాం లేనందుకా? 2జీ స్కాం లేనందుకా? ఎందుకు చార్జిషీట్ అని ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చి అమలుచేయని మీరు సిగ్గులేకుండా మాట్లాడటం ఏమిటని అడిగారు.
కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, మహిళలకు రూ.2500, గొల్ల కురుమలకు 12 వేలు, కూలీలకు 12 వేలు ఇస్తామన్నారు… ఒక్కటన్నా ఇచ్చారా? తురుంఖాన్ అని చెప్పిన కేసీఆర్‌నే లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు. అవే చేయలేనప్పుడు రేవంత్‌రెడ్డి లక్ష కోట్ల విలువైన హామీలు ఎలా నెరవేరుస్తారు అని హితవుపలికారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సోయి లేకుండా హామీలు ఇచ్చి మనలను గోల్‌మాల్ చేసిన రేవంత్‌ను ఇప్పుడు గోల్‌మాల్ చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ గడ్డ మీద ఎగిరేది కాషా య జెండా. 12 సీట్లు బీజేపీ గెలవబోతోంది. రేవంత్ నీ డబ్బు సంచులు, మద్యం సీసాలు, తాల్ బోల్ మాటలు చైతన్యవంతమైన ప్రజలను ఏమీ చేయలేవు. రాబోయే కాలంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీ అని స్పష్టం చేశారు.