Mahanaadu-Logo-PNG-Large

ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్‌

మాఫియా రాజ్యం, అవినీతి, నేరాల్లోనే అగ్రస్థానం
అరాచకాలే తప్ప అభివృద్ధి పట్టని ప్రభుత్వం
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు

నరసరావుపేట, మహానాడు : వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతే తప్ప అభివృద్ధి లేదని నరసరావు పేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కూటమి తరపున ఐదేళ్ల వైసీపీ పాలనపై చార్జిషీట్‌ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. కక్షపూరితమైన చర్యలు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచేశారని, ప్రజలపై పన్నుల భారాన్ని వేశారన్నారు.

ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రూ.10 లక్షల భారం వేశారన్నారు. ల్యాండ్‌, శాండ్‌, మైనింగ్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్రచందనం, రేషన్‌ బియ్యంలో రూ.8 లక్షల కోట్లు కమీషన్‌ కాజేశారని విమర్శించారు. విషపూరిత మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేసి 30 వేల మహిళల మాంగ ల్యాలను మంటగలిపారని పేర్కొన్నారు. విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ, ఇసుక ధరలను విపరీతంగా పెంచి దోచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన తప్పు లు, అన్యాయాలపై ఎన్‌డీఏ కూటమి చార్జిషీటు విడుదల చేసిందన్నారు. దీనిని ప్రజల వద్దకు తీసు కువెళ్లి ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్‌, కపిలవాయి విజయ్‌కుమార్‌, బండారుపల్లి విశ్వే శ్వరరావు, పులుకూరి జగ్గయ్య, కొల్లి వెంకటేశ్వర్లు, గాడిపర్తి సురేష్‌, కామినేని అమర్నాథ్‌, చిన్నపరెడ్డి, మడక ప్రసాద్‌, దావల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.