– గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే మాధవి వద్ద బాధితుల మొర
గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. అరండల్ పేటలో ఇటీవల ఉద్యోగాల పేరుతో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ తమ వద్ద నుండి లక్షలో వసూలు చేసి మోసం చేసిందని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎమ్మెల్యే వద్ద గోడును వెళ్ళబోసుకున్నారు. సంస్థ నిర్వాహకుడి పై చర్యలు తీసుకొని తమ డబ్బులు వెనక్కి ఇప్పించి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవి స్పందిస్తూ…ఈ విషయము తన దృష్టికి వచ్చిందని, దీని పై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, నిందితుడు ఎంతటి వాడు అయిన ఖచ్చితంగా అరెస్టు చేసి శిక్షించాలని పోలీసులకు సూచించినట్టు చెప్పారు. ఎస్పీ దృష్టికి కుడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి, బాధితులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.