-ఆలయాల్లో అర్చకులకే ప్రాధాన్యత..కూటమి ప్రభుత్వ జీవో.223 పై ఒకపక్క హర్షం, మరోపక్క అనుమానం…
-దేవాదాయ శాఖ ఈవోలు, ఏసీలు, డీసీలు, కమిషనర్ తో సహా దేవాలయ అర్చకులపై, ఆగమ సాంప్రదాయాలపై నియంతృత్వ పాలన…
-దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసే వరకు అర్చకులకు,భక్తులకు అనుమానాలే,అవమానాలే…
-గత ప్రభుత్వంలో పనిచేసిన ఎండోమెంట్ కమిషనర్ ని ఇంతవరకు తొలగించలేదు…
-అధికారులుగా తప్పుడు దృవీకరణ పత్రాలతో ప్రమోషన్లు…
-దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అన్య మతస్తుల్ని తక్షణమే తొలగించాలి…
-రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
అమరావతి: గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అర్చకులకు ఆగమ సాంప్రదాయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం జీవో.223 జారీ చేయడం పట్ల రాష్ట్రంలో ఉన్న అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అయినా కానీ ఈ జీవో అమలుపరిచే విధానంలో దేవాదాయ శాఖ అధికారులు అర్చకులకు ఏ మాత్రం సహకరించరిమోనని అనేక అనుమానాలు శ్రీధర్ వ్యక్తం చేశారు.
ఎందువల్ల అంటే ఇంతకాలం దేవాలయాలపై, అర్చకులపై పూర్తిస్థాయి పెత్తనాన్ని, నియంతృత్వ వైఖరిని దేవాలయంలో పనిచేసే స్వీపర్ దగ్గర నుంచి ఈవో, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు కమిషనర్ వరకు నియంతృత్వం చేసేవారని, ఇప్పటికిప్పుడు ఈ జీవో ద్వారా దేవాలయ ఆగమ సాంప్రదాయాల,ఆచారాల పరిరక్షణ అనేది అర్చకులకు అప్పజెప్పడం దేవాదాయ శాఖలో అధికారులకు మింగుడు పడని అంశమని అందువల్లే తాము దీనిపై అనుమాన వ్యక్తం చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు.
గతంలో దేవాలయ ఈవోలు ఆగమ సంకరాలు చేపడుతున్న సరే అర్చకుడు వాటిని ఆపలేక, ఎదురు తిరగలేక, ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో దేవుడు దగ్గర భాదతో మొరపెట్టుకునేవాడని, అంతలా అర్చకుడిని దేవాదాయ శాఖ అధికారులు భయపెట్టేవారని అందువల్లే అర్చకుడు యొక్క వారసులు వచ్చే తరానికి దేవాలయాల్లో లేకుండా చేయటంలో దేవదాయ శాఖ అధికారులు కీలకపాత్ర వహించారని, ఇప్పుడు దేవాలయంపై పెత్తనం తమ చేతుల్లోంచి పోతున్నప్పుడు వాళ్లు ఈ శాఖలో వివిధ రకాల కుట్రలు కూడా పన్నుతారని, దీన్ని ప్రభుత్వం ఎలా అరికడుతుందో, అధిగమిస్తుందో అని శ్రీధర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు సనాతన ధర్మo పేరుతో దేవాలయాలకు అర్చకులకు, అనుకూలంగా ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తిరుమలలో వారాహి డిక్లరేషన్ ఇస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం ద్వారా డెడికేషన్ జిఓ అందజేశారని, ఈ జీవోను తాము స్వాగతిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
ఈ జీవో తో పాటు దేవాదాయ శాఖలో ఉన్న అన్యమతస్తుల్ని తొలగించి వేరే శాఖలోకి బదిలీ చేసే విధంగా ఒక ప్రత్యేక జీవో ప్రభుత్వం జారీ చేస్తేనే మన రాష్ట్రంలో దేవాలయ,అర్చక వ్యవస్థ బ్రతికి ఉంటుందని, లేనిపక్షంలో దేవాలయాల్లో ఈవోలు ఆధ్వర్యంలో ఆగమ సంకరాలు జరిగి అనేక అపచారాలతో దేవాలయ వ్యవస్థ కుంటుపడుతుందని, అందువల్ల దేవాదాయ, ధర్మాదాయ శాఖలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పనిచేస్తున్న అన్యమతస్తులను తొలగించాలని శ్రీ చాలామంది ఈ శాఖలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈవోలు ఏసీలు, బీసీలు ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు పొంది ఉన్నారని దీనిపైన ప్రభుత్వం విచారణ చేయాలని దేవాదాయ శాఖ కు చెందాల్సిన సొమ్మును వేలం పాటల పేర్లతో సగం పైగా నొక్కేస్తున్నారని అన్నారు.
గత జగన్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ భూములను ఈ పై అధికారులే వైసిపి పార్టీ నాయకులకు అన్యాక్రాంతం చేశారని, దానిద్వారా కోట్ల రూపాయల లబ్ధి పొందారని దీనిపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గత జగన్ ప్రభుత్వంలో ఇదే శాఖలో ఎన్నో అరాచకాలు,అక్రమాలు చేశారని, ఆయన ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఎందుకు కమిషనర్ గా కొనసాగిస్తుందని శ్రీధర్ ప్రశ్నించారు. ట్రాన్స్ఫర్ ల పేరుతో లక్షల రూపాయలు దోచుకున్నారని, ఇటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో కొనసాగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని శ్రీధర్ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల అర్చకులకు దేవాలయ వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుతుందని దానివల్ల ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా దేవాలయ నిర్వహణ జరుగుతుందని, ఇప్పటివరకు ఆగమ సంకరాలతో వ్యవస్థను దేవాదాయ శాఖ అధికారులు సర్వనాశనం చేశారని, ఆగమాలు, శాస్త్రాలు, వేదాలు ఏమాత్రం తెలియని దేవాదాయ శాఖ అధికారులు,సిబ్బంది దేవాలయాలపై,ఆర్చకులపై పెత్తనం, నియంతృత్వం చేయకుండా దేశంలో తొలిసారిగా జీవో.232 విడుదల చేసినది ఆంధ్రప్రదేశ్లో అడ్డుకట్ట వేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమేనని రాష్ట్రంలో ఉన్న అర్చక బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేశారు.
వేద పండితులు, ఘనాపాటిలు, పీఠాధిపతులతో చర్చించి వారి సలహాలు సూచనలతో ఈ జీవొని పూర్తిస్థాయిలో అమలయ్యేలాగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో దేవాదాయ శాఖ అధికారులు గతంలో మాదిరి దేవాలయ వ్యవస్థను రెస్టు పట్టించి ప్రభుత్వాన్ని మాయ చేసే పరిస్థితి ఉంటుందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ గతప్ప ప్రతిపక్షంలో ఇచ్చిన హామీల మేరకు అర్చకులకు 15,000 రూ.లు జీతాల పెంపు ,ధూపదీప నైవేద్యాల క్రింద 10,000 రూ.లు సమకూర్చటం, తదితర అంశాలపై శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి, వడ్డమాను ప్రసాద్, చిలుమూరు ఫణి, వంగవీటి చైతన్య, కూరపాటి కిషోర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేయకుండా ఉంచాలని శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు.