హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగు రిని కాపాడిన సాయిచరణ్‌ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన 15 ఏళ్ల సాయిచరణ్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ. పరిశ్రమలో కార్మికులు చిక్కుకోగా తాడు కట్టి కార్మికులను రక్షించాడు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో బాలుడిని పిలిపించి అభినందించారు.