– ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, మహానాడు: అత్యవసర సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి, ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్యానికి సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్టు, అటువంటి సీఎం సహాయ నిధిని గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని శాసనసభ్యుడుగా గద్దె రామమోహన్ అన్నారు. ఆదివారం ఉదయం అశోక్ నగర్ లోని తెదేపా కార్యాలయంలో 2వ డివిజన్ బ్రహ్మానంద రెడ్డి నగర్ కు చెందిన దుక్క లక్ష్మణరావుకు మోకాలు ఆపరేషన్ నిమిత్తం రూ.లక్షా పదివేలు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాన్ని గద్దె రామ్మోహన్ అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు రామమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకు భరోసా ఇచ్చే మంచి పథకం అన్నారు. మళ్లీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.