– చిరంజీవిపై జగ్గారెడ్డి సెటైర్లు
హైదరాబాద్ : మాజీ ఎంపి చిరంజీవిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ‘రైతుల పక్షాన ఉన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు. కానీ ఢిల్లీలో ధర్నా చేసిన రైతులకు మద్దతివ్వలేదు. చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్, పవన్, బీజేపీకే ఆయన మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఉంటే సరైన దారిలో ఉండేవారు.. ఇప్పుడు పక్కదారి పట్టారు’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.