– గుంటూరు ‘పశ్చిమ’ ఎమ్మెల్యే గళ్లా మాధవి
గుంటూరు, మహానాడు: పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో నాటకరంగ కళాకారులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్లా మాధవి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో అత్యున్నతస్థాయి శిఖరాలకు చేరుకున్న పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాధవి అన్నారు. తన అసమాన నటనతో, నృత్యాలతో, ఫైట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ చిరంజీవి అంటూ కొనియాడారు.
సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి కళాకారులకుందన్నారు. తెలుగువాడి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పిన తెలుగుతల్లి కన్నబిడ్డ చిరంజీవన్నారు. నడకలోనూ నాట్యం చేయగల నటరాజుడు చిరంజీవి అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవితో పోటీ పడగల శక్తి చిరంజీవికే తప్పా మరెవరికీ లేవంటూ పేర్కొన్నారు. ఒక్క తెలుగు సినీపరిశ్రమలోనే కాకుండా దక్షిణ భారతదేశ సినీ రంగంలో ఒకటి నుంచి పది స్థానాలూ ఆయనవేనని గళ్లా మాధవి అన్నారు. ప్రపంచ సినీ జగత్తులో అభిమానుల్ని సేవా తత్పరులుగా తీర్చిదిద్దిన ఏకైక నటుడు చిరంజీవి అని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. కళా రంగానికి, సమాజానికి చిరంజీవి చేసిన, చేస్తున్న సేవలు అజరామరమన్నారు.
అనంతరం కళాకారులకు పది వేల రూపాయల చెక్ ను అందించారు. ప్రముఖ నాటక రంగ కళాకారులైన పాగళ్ల సురేష్, పట్టంశెట్టి చిట్టిబాబు, మన్యం వీరయ్య, పట్టంశెట్టి రాంబాబు, కుంచనపల్లి వీరరాఘవమ్మ, కుర్రా ఆంజనేయులు, యస్ కే మీరావలి, గుంజి రమణలను ఎమ్మెల్యే గళ్లా మాధవి దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాభిమానులు పాములు, కూటమి నేతలు నంది సరస్వతి, కసుకుర్తి అరుణ, రాధా కృష్ణ మూర్తి, సయ్యద్ చాంద్, లా అంజి, కొలసాని బాలకృష్ణ, స్వామి, వడ్డె సుబ్బారావు, కోల చిరంజీవి, శేషు, బాలకృష్ణ స్టూడియో, బాజి, ఖర్జూర శ్రీను, నాజర్ వలి, మిద్దె నాగరాజు తదితరులున్నారు.