చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి

తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి 

చిత్తూరు , మహానాడు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని దద్దమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..  ఒక రాజధాని కట్టలేని పనికిమాలిన మంత్రి ముప్పై రాజధానులు కడతాను అని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల భూములను అక్రమంగా దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం దాడులు, దారుణాలు అనేకం పెద్దిరెడ్డి కబ్జాలు, దోపిడీపై ఫిర్యాదులు వస్తున్నాయి పుంగనూరు కాకుండా జిల్లా అంతటా దోపిడీ చేశారు. చిత్తూరు జిల్లాలో రూ.వేల కోట్లు దోచుకున్నారు. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి

ప్రజల ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని  పెద్దిరెడ్డి కి సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోవాలి. చెవిరెడ్డికి చంద్రగిరి ఇసుకలో 1000 కోట్లు అక్రమ సంపాదన, భూమనకు తిరుపతి, రోజాకు నగరి వదిలి.మిగతా అన్ని ప్రాంతాల్లో వీరప్పన్ పెద్దిరెడ్డి అనుచరులు వారి బినామీలు దోచుకున్నారు. పెద్దిరెడ్డి దోచుకున్న భూములను బాధితులకు వెంటనే ఇవ్వాలని లక్ష్మయ్య డిమాండ్ చేశారు.