క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని

గుంటూరు, మహానాడు: ఏసుక్రీస్తు బోధనలు మానవ మనుగడకు మార్గదర్శకం, ఏసు బోధించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీి అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సందేశమిచ్చారు. పెదకాకానిలో సోమవారం క్రీస్తు స్వస్తిశాల ప్రార్థనల కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. కార్యక్రమంలో సంబంధిత పాస్టర్ల నుంచి పెమసాని ఆశీర్వాదం అందుకున్నారు. ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ అందజేస్తారని, సాటి మనుషుల మేలు కోసం ప్రయత్నించే నాయకులకు ఎప్పుడు మంచే జరుగుతుందని ఈ సందర్భంగా పాస్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తాడికొండ నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.