Mahanaadu-Logo-PNG-Large

వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

అమరావతి: బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జగన్‌ హయాంలో వైసీపీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీలు అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టారు.