– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు: పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేయవచ్చని, స్వాతంత్య్రం కంటే స్వచ్ఛతకే గాంధీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా ముంగిపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. స్వాతంత్య్రం, సమానత్వం, అహింస కోసం గాంధీజీ నిరంతరం కృషి చేశారన్నారు. పరిసరాల పరిశుభ్రతలో కీలక భూమిక పోషించే పారిశుద్ధ్య కార్మికుల ఆత్మభిమానం పెంపొందించేలా వారికి అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్దితో అమలు చేస్తామన్నారు.
కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ గాంధీ నుంచి స్ఫూర్తి పొందే అంశాలలో స్వచ్ఛత ప్రధానమైనదని, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 2014 నుంచి గాంధీ జన్మదినం రోజు అక్టోబరు 2 స్వచ్ఛ భారత్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛ గుంటూరు సాధనకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.
ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ కంటి రెప్పాల కాపాడుతున్న కార్మికులకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ స్వచ్ఛత స్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు స్వఛ్చ గుంటూరు సహకారానికి కృషి చేస్తామన్నరు. ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ ఆర్) వీరా స్వామి, డిప్యూటీ మేయర్ సజీలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాసు, డి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, సీపీ రాంబాబు, ఎస్ఈ శ్యాం సుందర్, ఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఐటీసీ బంగారు భవిష్యత్ నుండి గౌరీ నాయుడు, నారాయాణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.