అమరావతి, మహానాడు: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పార్వతమ్మ మృతి ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.