-హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం
-హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు. రాజీనామా లేఖ అలా ఉండదు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు.
స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది.హరీష్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం…నీ రాజీనామా రెడీగా పెట్టుకో.