-మృతుల కుటుంబాలకు సంతాపం
-వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని వెల్లడి
అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమా దం చోటుచేసుకుంది. హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది.