సత్తెనపల్లి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు
టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో ఆదివారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. భారీ ర్యాలీతో పట్టణ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగిందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి. డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవు, ఆయా రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం వల్ల సత్తెనపల్లి పట్టణం వెనుకబడి ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కంటే వైసీపీ పాలనలో కొంచెం కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
ప్రజలకు పథకాలు అనే పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ప్రస్తుత ప్రభుత్వంపై విసుకుచెంది ఉన్నారని, కూటమి రాగానే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అవుతా య ని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.