పోలీసుల కనుసన్నల్లోనే వ్యవహారమంతా…
కాటూరు, మహానాడు: కాటూరులో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే రాత్రీపగలు తేడా లేకుండా కోడిపందాల నిర్వహిస్తున్నారు. పక్క నియోజకవర్గానికి బదిలీపై వెళ్లిన పోలీస్ అధికారి అండతోనే పందాలు జరుగుతున్నాయంటూ బహిరంగ చర్చించుకుంటున్నారు.
ప్రశాంతంగా ఉన్న గ్రామాలు జూదశాలలుగా మారుతున్నాయంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముదునూరులో జరుగుతున్న పేకాటలో పట్టుబడ్డ ఓ అధికార పార్టీ నాయకుడు వద్ద 70,000 లంచం తీసుకున్నట్టు విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ 70,000 లంచం తీసుకుని వదిలేసిన పోలీస్ అధికారి (ఆవేశం స్టార్)ఎవరు? అని అంటున్నారు. గత కొంతకాలంగా రూరల్ పోలీసుల అండతోనే గ్రామాలలో కోడి పందాలు జూదశాల లు జరుగుతున్నాయి అంటూ చర్చించుకుంటున్న ప్రజలు…. గతంలో బోళ్లపాడు కేంద్రంగా సాగే కోడిపందాలు పేకాట శిబిరాలు ఇప్పుడు కాటూరు ముదునూరు గ్రామాల్లో జరుగుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం మారినా మారింది నిర్వహించే కేంద్రాలేనన్న విమర్శలు ఉన్నాయి.
ప్రశాంతంగా ఉండవలసిన గ్రామాలు ఇలా జూద శిబిరాలగా మారడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల గ్రామంలోని యువకులు చెడు మార్గం పట్టే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు కల్పించుకుని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ జూద క్రీడలను కోడిపందాలను అరికట్టాలని కోరుకుంటున్నారు.