Mahanaadu-Logo-PNG-Large

స్ట్రాంగ్‌రూమ్‌ సమీపంలో కోడ్‌ ఉల్లంఘన

సీఎం భద్రతా సిబ్బంది, వైసీపీ నేతల పార్టీ
ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు ఫిర్యాదు
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని వినతి

గుంటూరు, మహానాడు : గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని ఈవీఎంలు భద్రపరిచిన ఆచార్య నాగార్జున యూనివ ర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌ సమీపంలో సీఎం సెక్యూరిటీ ఎస్‌ఎస్‌జీ సిబ్బంది, వైసీపీ నాయకులు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకోవడమే కాకుండా సిద్ధం సభల డీజే పాటల తో హల్‌చల్‌ చేశారు. మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు శిష్యుడు, సీఎం సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ అట్టాడ బాబ్జి, అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీ జరిగినట్లు సమాచారం. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ సమీపం లో పార్టీ చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల దగ్గర భద్రత పెంచాలని కోరుతున్నారు. ఓటమి భయంతో వైసీపీ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని అంటున్నారు.

సీఈవోకు చంద్రబాబు ఫిర్యాదు

నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకున్న సీఎం సెక్యూరిటీ సిబ్బంది, వైసీపీ నేతలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియ మావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్‌తో అధికార పార్టీ డీజే పాటలతో పార్టీ నిర్వహిం చారు. ఈ పార్టీలో 450 మందికి పైగా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్‌ ఎస్పీ అత్తాడ బాబ్జిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.