-ఏఎన్‌యూలో కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాల తనిఖీ
-మీడియా సెంటర్, పార్కింగ్‌కు సూచనలు
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూండి, సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) స్వప్నిల్ జగన్నాథ్, గుంటూరు ఆర్డీవో శ్రీకర్, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ముందుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైక్ మెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం పాత్రికేయులకు మీడియా సెంటర్ కోసం ఏర్పాటు చేయనున్న హాలును పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. అనంతరం ఏఎన్‌యూలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, అభ్యర్థుల వాహనాల పార్కింగ్‌కు యూనివర్సిటీలో స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుం టూరు పార్లమెంటు నియోజకవర్గం ఏఆర్‌ఓ భీమారావు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.