గుంటూరు: సుప్రీంకోర్టు జడ్జి సి.టి.రవికుమార్‌ను గురువారం సెక్రటేరియట్ సమీపాన ఉన్న విట్ విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు విట్ యూనివర్సిటీ ప్రాంగణా నికి చేరుకున్న ఆయనకు జిల్లా జడ్జి పార్థసారథి, జాయింట్ కలెక్టర్ జి.రాజకు మారి, గుంటూరు ఆర్డీవో పి.శ్రీకర్ సాదర స్వాగతం పలికారు.