హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
బాలికలతో కలసి భోజనం చేసిన కలెక్టర్ సృజన
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించారు. ఆ మేరకు ఆమె జిల్లాలోని హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు, అధికారుల పనితీరు, స్కూళ్లలో పరిస్థితులను ఆమె సునిశితంగా తనిఖీ చేస్తున్నారు.
తాజాగా సృజన.. ఏ.కొండూరు మండలం పెద తండా అంగన్వాడీ సెంటర్, తిరువూరు గర్ల్స్ హైస్కూలులో మధ్యాహ్నభోజన పథకం అమలుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధినులతో కలసి సహపంక్తిభోజనం చేశారు. భోజన నాణ్యత ఎలా ఉంది? రోజూ భోజనంలో మెను ఏమిస్తున్నారంటూ బాలికలను వాకబు చేశారు. కాగా వర్షాకాలం నేపథ్యంలో కట్టలేరు బ్రిడ్జిని సృజన పరిశీలించారు.