– సీఎస్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లకు సీఎం శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో నెలకు ఒకసారి నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, విష జ్వరాలు, సౌర్యాల కొరతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే.