పల్లెవెలుగు బస్సులో కలెక్టర్‌ ప్రయాణం

ఓటుహక్కుపై ప్రయాణికులు, సిబ్బందికి అవగాహన

గుంటూరు, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్‌ గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ముందుగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఓటు హక్కుపై అవగాహన కల్పించిన ఆయన అనంతరం సత్తెనపల్లి పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ప్రయాణికుల తో ముచ్చటించారు. ప్లకార్డులు ప్రదర్శించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.