దాచేపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల అంజనాపురం కాలనీలో గురువారం కలెక్టర్ అరుణ్ బాబు పర్యటించారు. డయేరియా తో ఇద్దరు మృతి చెందారన్న సమాచారంతో అధికారులతో ఆ కాలనీని పరిశీలించారు. ఇంకా ఈ గ్రామానికి చెందిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంజనాపురం కాలనీలో జరుగుతున్న వైద్య చికిత్స, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. డయేరియా ఎలా సోకింది అనే అంశంపై ప్రభుత్వ వైద్యాధికారులను, మున్సిపాలిటీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలందరూ ఈ ప్రాంతంలో డయేరియా కేసులు తగ్గేవరకు కాచి చల్లార్చి నీళ్లు తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.