Mahanaadu-Logo-PNG-Large

అసెంబ్లీకి రా…సొల్లు పురాణం ఎందుకు?

పాపాలను సమర్థించుకునే ప్రయత్నం కేసీఆర్‌ది
12 సీట్లతో ప్రధాని అవుదామని పగటి కలలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. గాంధీభవన్‌లో విద్యుత్‌, సాగునీరు, తాగునీరు తదితర అంశాలపై శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్గం అంటే ఏమిటో చూపలేక తానున్న చోటే స్వర్గం ఉన్నదని నమ్మించి వెర్రి భ్రమలు కల్పించే కేసీఆర్‌ తాను ఒక్కడినే సర్వజ్ఞుడిని అన్నట్లుగా విర్రవీగుతున్నారని మండిపడ్డా రు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ పచ్చి అబద్ధాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ మాటల్లో…ఆయనొక్కడే మొనగాడు

నేను మాత్రమే మొనగాడిని..ఇతరులంతా అర్భకులు, తెలివి లేని అమాయకులు, మూర్ఖు లు. తాడిని తన్నే మొనగాడినని డబ్బా కొట్టుకుంటున్న కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రావ డం లేదని ప్రశ్నించారు. మేము చెప్పేవి అబద్ధాలైతే నిజాలు ఏమిటో కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. కేసీఆర్‌ కోసం అసెంబ్లీని ఎప్పుడైనా సమావేశపరచడానికి మేం సిద్ధమని తెలిపారు. అక్కడ జరిగే చర్చలో ఆయన తన వైఖరిని చెప్పవచ్చు. నిజాలు ఏమిటో.. అబద్ధాలు ఏమిటో తేలిపోతుంది. ప్రజావేదిక అసెంబ్లీకి రాకుండా ఎక్కడో ఇతర వేదికల్లో సొల్లు పురాణం చెబుతున్నారు. దొరికిపోతారనే భయమా? అంటే తప్పు చేశారు అని అర్థం కదా…అందుకే అసెంబ్లీకి రావడం లేదని భావించాలా? నేను ఇంద్రుడిని చంద్రుడిని తనకు తప్ప పాలన ఎవరికీ చేతకాదు అన్నట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతు న్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా కేసీఆర్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 12 సీట్లు వస్తాయని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి దేశానికి ప్రధాని అవుతానని అప్పట్లో కూడా పగటి కలలు కన్నారు. ఆ పార్టీకి ఒకటి రెండు చోట్ల రెండవ స్థానం వస్తే చాలా గొప్ప అని ఎద్దేవా చేశారు.