– అభివృద్ధికి బాటలు వేద్దాం కలిసి రండి
– సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల్లో అభివృద్ధికి చేయి చేయి కలపండి- విజయాన్ని అందించండి… సమష్టిగా ప్రగతిగా అడుగులేద్దామని ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రాజరాజేశ్వరి పేట జనప్రియ అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభివృద్ధి కమిటీ పెద్దలు పెరవలి చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు మహమ్మద్ రఫీ వారికి ఘన స్వాగతం పలికారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల వినతి పత్రాన్ని సుజనాకు కమిటీ పెద్దలుఅందజేశారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని జనప్రియ అపార్ట్ మెంట్ వాసులు చెప్పారు.
తనపై జనప్రియ అపార్ట్ మెంట్ వాసులు చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని సుజనా అన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించి రాజరాజేశ్వరి పేటను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. జనప్రియ అపార్ట్ మెంట్ వాసులు తక్షణ పరిష్కారం కోసం యాబై శాతం డిస్కౌంట్ తో సుజనా ట్రస్ట్ నుంచి మినీ ఎలక్ట్రికల్ బస్సు ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు నియోజవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం 22డివిజన్లలో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి అందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కేశినేని శివనాద్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నో సమస్యలు దర్శనమిస్తున్నాయని వీటిని పరిష్కరించడంతో పాటు వెనుకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు.
ఎన్డీఏ కూటమిని గెలిపించుకుని కలల రాజధాని అమరావతిని నిర్మించుకుందామని అన్నారు. ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేత పైలా సోమినాయుడు, జనప్రియ అపార్ట్ మెంట్ వాసులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు