విశాఖపట్నం, మహానాడు: విజయవాడ వరద బాధితులకు చేతనైన సాయం చేసేందుకు జీవీఎంసీ 95వ వార్డు పరిధి పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్ నివాసితులు నడుం కట్టారు. అసోసియేషన్ పిలుపుమేరకు స్పందించిన నివాసితులు అందచేసిన రూ. 50 వేలు చెక్ రూపంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుజాతనగర్ శాఖ మేనేజర్ సూర్యనారాయణ ద్వారా మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వి.రామకృష్ణ, కార్యదర్శి ఎం.సత్యనారాయణ, దేవాలయ కమిటీ కార్యదర్శి తాడిమేటి మాధవ్, కోశాధికారి ఆలమూరి కేశవరావు పాల్గొన్నారు.