వాటర్ ప్లాంట్ ప్రారంభం

వినుకొండ నియోజకవర్గ శావల్యాపురం మండలం కనుమల్లపూడి, మంత్రివారిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.